ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కింగ్' గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 04:41 PM

బాలీవుడ్ స్టార్ నటుడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రానున్న చిత్రం 'కింగ్' లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నటుడు తన కుమార్తె సుహానా ఖాన్ తో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం సుహానా యొక్క వెండి తెర తొలి ప్రదర్శనను సూచిస్తుంది. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌ ని పూర్తి చేయటం పై దృష్టి సారించాడు మరియు షూట్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. ఈ బిగ్గీలో SRK కు జోడిగా దీపికా పదుకొనే కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ స్టంట్స్ కోసం మేకర్స్ అన్ని సిద్ధం చేస్తున్నారు. సెట్స్ నుండి కొన్ని చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పబడింది. కింగ్ లో అభిషేక్  బచ్చన్ విరోధిగా నటిస్తున్నాడు. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa