ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 25న విడుదల కానున్న గ్రౌండ్ జీరో

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 05:54 PM

జమ్మూ కశ్మీర్‌లో ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా అక్క‌డ‌ సినిమా విడుద‌ల చేయ‌డం స‌వాల్‌తో కూడుకున్న ప‌ని. అందులోనూ శ్రీనగర్‌లో అంటే పెద్ద టాస్కే. కానీ ఆ అసాధ్యం సుసాధ్యం కాబోతోంది. 38 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో గ్రౌండ్ జీరో అనే సినిమాతో ఓ హిస్టారిక్ మూమెంట్ మొద‌లుకాబోతోంది. ఇండియన్ ఆర్మీ, బీఎస్‌ఎఫ్ హీరోలకు డెడికేట్ చేస్తూ ఈ సినిమా ప్రీమియర్ ఏప్రిల్ 18న శ్రీనగర్‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతుండ‌టం ఆస‌క్తిగా మారింది.. రెడ్ కార్పెట్ వేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయలేకపోయినా, ఈ ఈవెంట్ దేశవ్యాప్త హైప్ క్రియేట్ చేస్తోంది.గ్రౌండ్ జీరో సినిమా.. 2001 పార్లమెంట్ దాడి తర్వాత బీఎస్‌ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధర్ దూబే నడిపిన స్పెషల్ ఆపరేషన్ ఆధారంగా రూపొందింది. ఈ ఆపరేషన్‌లో దాడి సూత్రధారి ఘాజీ బాబాను అంతమొందించారు. రియల్ లైఫ్ ఈవెంట్స్‌తో పాటు కొన్ని కల్పిత సన్నివేశాలను జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. ఏప్రిల్ 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతుండ‌గా.. ముందుగానే శ్రీనగర్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్‌తో బజ్ క్రియేట్ చేయబోతున్నారు.ఈ ప్రీమియర్‌కి ఆర్మీ బిగ్‌విగ్స్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని టాక్. మొదట ఈ ప్రాజెక్ట్‌లో సల్మాన్ ఖాన్‌ని హీరోగా తీసుకోవాలని ప్లాన్ చేశారు, కానీ అతను కిసీ కా భాయ్ కిసీ కి జాన్ , సికందర్ సినిమాలతో బిజీగా ఉండటంతో, రెండేళ్లు వెయిట్ చేయమనడంతో టీమ్ ఇమ్రాన్ హస్మీ ని సంప్ర‌దించింది. దూబే రోల్‌లో ఇమ్రాన్ రక్తి కట్టించాడ‌ని చెబుతున్నారు. శ్రీన‌గ‌ర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌డ‌మంటే స్క్రీనింగ్ మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం పోరాడే హీరోలకు ఓ నివాళి అని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa