ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 02:30 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరోసారి ప్రమాదానికి గురయ్యారు. బెల్జియంలో జరిగిన సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌ఛాంప్స్ రేస్‌లో అజిత్ పాల్గొన్నారు. ఈ రేస్‌లో అజిత్ కారు అదుపుతప్పి ట్రాక్ నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అజిత్ క్షేమంగా బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కాగా ఇటీవల కూడా అజిత్ రేస్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.రేసింగ్ సమయంలో ఇంతకు ముందు కూడా హీరో అజిత్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈయన నడుపుతున్న వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇక, జనవరిలోనూ దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా.. ఆయన కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి సైతం ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పోర్చుగల్‌లో జరిగిన కార్ రేస్ పోటీల్లో అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa