ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అలప్పుజా జింఖానా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 09:12 PM

మలయాళం నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన 'అలప్పుజా జింఖానా' ఏప్రిల్ 10, 2025న మలయాళంలో విడుదల అయ్యింది. ఈ స్పోర్ట్స్ డ్రామాకి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్థిరంగా ఉంది మరియు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 25, 2025న తెలుగు విడుదల కోసం సిద్ధమవుతోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు అంటే ఏప్రిల్ 22న 6 గంటలకి హైదరాబాద్ లోని హోటల్ దస్పలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో లుక్మన్ అవరాన్, గణపతి ఎస్., సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ మరియు రీలిస్టిక్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సంగీతాన్ని విష్ణు విజయ్ స్వరపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa