కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'విరూపాక్ష' సినిమాలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా విపరీతమైన పాపులారిటీ సంపాదించడమే కాకుండా సాయి తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే రాశారు. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ విరూపాక్షను నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం యొక్క సీక్వెల్ ని మేకర్స్ దృవీకరించారు. ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సీక్వెల్ లో ప్రముఖ నటి భాగ్య శ్రీ బోర్స్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజులలో ఈ సినిమాకి సంబందించిన వివరాలని మేకర్స్ వెల్లడి చేయనున్నారు. ప్రస్తుతం సాయి దుర్గం తేజ్ 'సంబారాలా యేటి గట్టు' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa