ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పాన్-ఇండియా స్కేల్లో చేయనున్నారు. బహుముఖ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూరి జగన్నాద్ మరియు విజయ్ సేతుపతి మొదటి సహకారాన్ని సూచిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఆన్ బోర్డులో ప్రముఖ కన్నడ నటుడు విజయ్ కుమార్ ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషించడానికి సెలెక్ట్ అయ్యింది. మిగిలిన తారాగణం మరియు సిబ్బంది గురించి వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. ఈ చిత్రాన్ని పూరి జగన్నాద్ మరియు ఛార్మి కౌర్ పూరి కనెక్ట్స్ బ్యానర్ కింద నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa