ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో ప్రజాదరణ పొందిన తరువాత నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన 'అలప్పుజా జింఖానా' తెలుగు వెర్షన్ ఏప్రిల్ 25, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమాకి భారీ స్పందన లభించింది మరియు ఎక్స్ట్రా షోస్ కూడా జోడించబడుతున్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాకి ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదలైన 3 రోజులలో తెలుగురాష్ట్రాలలో 3.7 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించింది. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ మరియు రీలిస్టిక్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రం సంగీతాన్ని విష్ణు విజయ్ స్వరపరిచారు. ఈ చిత్రంలో లుక్మన్ అవరాన్, గణపతి ఎస్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa