'విక్రాంత్ రోణ' సక్సెస్ తర్వాత బాద్ షా కిచ్చా సుదీప్ దర్శకుడు అనూప్ భండారి మళ్లీ కలిసి భారీ అంచనాలున్న చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి 'బిల్లా రంగ బాష' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం 2209 ADలో సెట్ చేయబడిన భవిష్యత్తు ప్రపంచాన్ని ఒక సంగ్రహావలోకనం ఇస్తూ దాని అద్భుతమైన కాన్సెప్ట్ వీడియో మరియు అధికారిక లోగోను ఇటీవలే విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించినట్లు అధికారకంగా ప్రకటించారు. నటుడు సుదీప్ మెడ పై ఒక టాటో ఉన్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఇతర తారాగణం మరియు సిబ్బందికి సంబంధించిన వివరాలు తరువాత దశలో వెల్లడి చేయబడతాయి. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెండు-భాగాలుగా విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలనై మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa