ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న 'కిల్లర్' గ్లింప్సె

cinema |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 03:56 PM

దర్శకుడు మరియు నటుడు పూర్వాజ్ 'కిల్లర్‌' అనే మరో గ్రిప్పింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో పూర్వాజ్ సరసన జ్యోతి పూర్వాజ్ నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో విశాల్ రాజ్ మరియు గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్వాజ్, ప్రజయ్ కామత్, మరియు ఎ. పద్మనాభా రెడ్డి థింక్ సినిమా బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లింప్సెని తెలుగు మరియు కన్నడలో విడుదల చేసారు. ఈ సినిమా పై గ్లింప్సె భారీ అంచనాలని పెంచింది మరియు అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా గ్లింప్సె తెలుగు మరియు కన్నడలో 2500000 వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోని షేర్ చేసింది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa