హీరోయిన్లు పబ్లిక్‌లోకి వస్తే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. సందు దొరికితే తప్పుగా ప్రవర్తించే వారే ఎక్కువ. సెలెబ్రిటీలు బయటకు వస్తే ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్‌లో ఉండటం లేదు. హీరోయిన్లను అయితే చుట్టు ముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. కొన్ని సార్లు ఆకతాయిలు హద్దులు మీరుతుంటారు. మొన్నా మధ్య ఇలానే గుంపులోంచి వెళ్తుంటే.. ఎవరో ఆకతాయిలు శ్రీలీలను చేయి పట్టి లాగారు. ఇక ఇలాంటి పిచ్చి ఘటనలెన్నో జరుగుతుంటాయి. తాజాగా మంజు వారియర్‌కి ఇలాంటి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె రీసెంట్‌గా ఓ షాపింగ్ మాల్‌కు వచ్చినట్టుంది.ప్రారంభోత్సవం అనంతరం తిరిగి వెళ్తుంటే కారు వద్ద మంజు వారియర్ కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇక అందరికీ అభివాదం చేస్తూ, ఫోటోలు ఇస్తూ బిజీగా ఉంది మంజు వారియర్. అలాంటి టైంలో ఓ వ్యక్తి (అమ్మాయి, అబ్బాయి అన్నది క్లారిటీ లేదు) నడుముపై చేయి వేశారు. ఇక ఆ తరువాత అసభ్యకరంగా చేతులు ముందుకు తీసుకు వచ్చారు. ఇలా ఎంతలా ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా నవ్వుతూనే మంజు వారియర్ కనిపించింది.