స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శుభం అనే మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంత.. అట్లీ, అల్లు అర్జున్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీపై క్లారిటీ ఇచ్చారు. ఆ మూవీలో తాను నటించడం లేదని తెలిపారు. అట్లీ, అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో అట్లీతో ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. కాగా ఇప్పటికే సామ్ అట్లీ డైరెక్షన్‌లో రెండు సినిమాలు చేశారు.దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికైతే జాన్వి కపూర్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa