ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'VD 14' షూటింగ్ ప్రారంభం అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 05:20 PM

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం 'VD 14' కోసం రాహుల్ సంకృత్యాన్ తో జతకట్టిన సంగతి అందరికి తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ చరిత్రలో ఒక చిన్న రాజు జీవితంపై దృష్టి సారించే పీరియాడికల్ డ్రామా అని చెప్పబడింది. భారీ స్థాయిలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే విశేషమైన బజ్‌ని సృష్టించింది. ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభించబడింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా  రెగ్యులర్ షూట్ ఈ నెల చివరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలని మేకర్స్ రాయలసీమలో చిత్రీకరించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా నటిస్తుండగా, సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం 1854-78 బ్యాక్‌డ్రాప్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa