సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈడీ విచారణకు సోమవారం వెళ్లనున్నారని తెలిసింది. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ మనీ ల్యాండరింగ్ కేసులో మహేశ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వాటిలో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని ఆరోపణలున్నాయి. గత నెల 28న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్ కారణంగా రాలేకపోయారు. దీంతో ఇవాళ విచారణకు వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa