యంగ్ హీరో మంచు విష్ణువర్ధన్ ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్, విష్ణు సరసన హీరోయిన్‌గా నటించటం లేదట. ఈ ఇద్దరు ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా కనిపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతోంది. త్వరలోనే సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa