ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా కు పవర్ స్టార్ వాయిస్ ఓవర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 02:07 PM

మెగాస్టార్ చిరంజీవి హీరో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు జరుపు కుంటోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
కాగా.. ఈ భారీ బడ్జెట్ సినిమాకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ అందించారు. తాజాగా.. ఈ సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన ఫొటోలను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ఫొటోస్ చూస్తుంటే.. పవన్ ఎంతో ఆవేశంగా.. డబ్బింగ్ చెప్తున్నారని అనిపిస్తోంది. పక్కనే అన్నయ్య చిరు కూడా ఆవేశంగానే.. చాలా ఇన్వాల్వ్ అయి కనిపిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ ఫొటోలు కాస్తా.. వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఈ సినిమాపై హైప్ తెచ్చేందుకు రామ్‌చరణ్ రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. అందులో ఒక భాగమే.. పవన్ వాయిస్ అందించడమని సమాచారం. ఏదేమైనప్పటికీ అన్నయ్యని.. తమ్ముడిని చూసేసరికి.. అటు పవన్.. ఇటు చిరు అభిమానులకు పండగే పండుగలా ఉంది.
కాగా.. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నయనతార నటించగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా.. తమన్నా, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్, సుధీర్‌లు కీలక పాత్రలలో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa