ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మహర్షి' డెలీటెడ్ సిన్ చూసారా..

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 07:17 PM

అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచి..నేడు వందరోజుల పండుగను జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సామాజిక సందేశంతో కూడుకుని, కమర్షియల్‌ అంశాలతో ఉండటంతో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది.  సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో కొన్ని సీన్లకు కత్తెర వేశామని మూవీ ప్రమోషన్లలో చిత్రయూనిట్‌ పేర్కొన్నసంగతి తెలిసిందే. అయితే నేడు వందరోజులు అయిన సందర్భంగా.. ఈ మూవీ నుంచి తీసేసిన సన్నివేశాన్నిరిలీజ్‌ చేశారు. కాలేజ్‌లో గొడవకు సంబంధించిన ఈ సన్నివేశం అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మహర్షి తరువాత మహేష్‌ జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతూ.. సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు.


https://www.youtube.com/watch?v=DEColYiqGmw






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa