ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివి శేష్​కు ప్రముఖ నిర్మాత బంపర్ ఆఫర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 10:01 PM

అడవి శేష్..ఇప్పుడు టాలీవుడ్‌లో ఇతనో స్పెషల్ పర్సన్. కథలు, స్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ చిత్రాలతో  హీారోగా తెలుగు సినిమాని మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నాడు. కాగా తాజగా “ఎవరు”  మూవీ శేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు. వరుస హిట్​లు కొడుతున్న వేళ అడివి శేష్​కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత సినిమాను తన సంస్థలో చేయాలని ఆహ్వానించారు. శేష్ నటించిన “ఎవరు” డిస్ట్రిబ్యూటర్ వ్యవహరించిన దిల్ రాజు.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్‌తో హిట్ కొట్టొచ్చని శేష్ నిరూపించాడని ప్రశంసించారు. దిల్ రాజు నిర్మించిన “ఎవడు” చిత్రంలో కొద్దిలో అవకాశాన్ని చేజార్చుకున్న శేష్.. మళ్లీ ఆ అవకాశాన్ని “ఎవరు” తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నటుడు ‘మేజర్​’ సినిమా​లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేశ్​బాబు నిర్మాత.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa