ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘పరారి’

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 10:31 AM

యోగేశ్వర్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పరారి’. ”రన్‌ ఫర్‌ ఫన్‌” అనేది ఉప శీర్షిక. అతిథి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయి శివాజీ దర్శకుడు. శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తున్నారు.


‘పరారి’ చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్‌లో ఓ పబ్‌లో ”గరమ్‌ గరమ్‌ మురిగి మసాల” అనే ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు చిత్రబృందం. ఈ పాటలో యోగేశ్వర్‌, ముంబాయికి చెందిన డాన్సర్‌ మినాల్‌ నర్తించారు. భాను కొరియోగ్రఫి అందించారు. రవి అంబట్ల గీతాన్ని అందించారు. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర నిర్మాత జీవీవీ. గిరి తెలిపారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి శివాజీ మాట్లాడుతూ ” పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. కుటుంబనేపథ్యం కూడా ఉంది. చిత్ర నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా నిర్మించారు. యూత్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌ అనేకం ఉన్నాయి. అలాగే యువతకు ఓ సందేశం కూడా ఉంది. హైదరాబాద్‌తో పాటుగా బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరిపాం. హీరోగా పరిచయం అవుతున్న యోగేశ్వర్‌ బాగా నటించాడు. సహకరించిన టీమ్‌కు ధన్యవాదాలు” అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa