ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా టైటిల్ లీక్ చేసిన రష్మిక..

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2019, 12:01 PM

ఛలో.. గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకున్నరష్మిక ప్రస్తుతం తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో స్పీడు పెంచేసింది. ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా మారిపోయింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు`.. నితిన్ తో `భీష్మ`.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించనున్నసినిమాలో ఇప్పటికే రష్మిక నటిస్తోంది. తొలిసారి కార్తి సరసన నటిస్తున్న సినిమాతో తమిళ తంబీలను పలకరించబోతోంది. 


`రోమియో` ఫేమ్ భాగ్యరాజ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ వైపు తెలుగులో `సరిలేరు నీకెవ్వరు`.. భీష్మ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా వున్నా తమిళ సినిమాకు కూడా సమయం కేటాయిస్తోంది.`ఖాకీ` తరువాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దానికి తగ్గ స్థాయిలో సినిమాని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ని ప్రకటించలేదు. అయితే యూనిట్ కి తెలియకుండా రష్మిక ఈ మూవీ టైటిల్ ని  సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేసింది.


లేటెస్ట్ గా ఆన్ లొకేషన్ చిత్రీకరణలో పాల్గొన్న రష్మిక `సుల్తాన్` షూటింగ్ లో ఇది నాలుగవ రోజు అంటూ టైటిల్ పై క్లూ ఇచ్చేయడం విశేషం. `యు డోంట్ గెట్ టు సీ ద లుక్ యో` అని ఆన్ లొకేషన్ పిక్ ని పోస్ట్ చేసి మూవీ టైటిల్ ని తనకు తెలియకుండా తానే బయటపెట్టేసింది. టైటిల్ తెలిసిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ టైటిల్ నే కార్తీ ఫ్యాన్స్ వైరల్ గా ముచ్చటించుకోవడంతో అది కాస్తా చిత్రయూనిట్ కి తెలిసిపోయిందట. మరి అధికారికంగా టైటిల్ ని ప్రకటించకుండానే లీక్ చేసేసిన రష్మికపై చిత్రయూనిట్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa