రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలలో 'హౌస్ఫుల్ 5' అనే చిత్రంలో కనిపించనున్నారు. తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన ఈ సినిమా టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా యొక్క ట్రైలర్ మే 27న మధ్యాహ్నం 1 గంటకి విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ సెన్సార్ పూర్తి చేసుకొని UA సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, జక్క్యూలినే ఫెర్నాండేజ్, కృతి మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 6, 2025న విడుదల కానుంది. దీనిని సాజిద్ నాడియాద్వాలా యొక్క నాడియాద్వాలా గ్రాండ్స్లోన్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa