ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జక్కన్న మాటలకూ ప్రభాస్ కన్నీళ్లు

cinema |  Suryaa Desk  | Published : Sun, Aug 18, 2019, 10:12 PM

బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పెద్ద డైరక్టర్‌లతో సినిమా చేయకుండా కథను నమ్మి ‘సాహో’ చేశారని అదే తనకు నచ్చిందని స్టార్ డైరక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి అన్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం సాహో. సుజీత్‌ దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక రామోజీ ఫిల్మ్‌సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..   ‘సాధారణంగా ఏ హీరో అభిమాని అయినా తన హీరో సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. కానీ, అందరి హీరోల అభిమానులు ప్రభాస్‌ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్‌ అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటాడు. ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే తన తర్వాత చిత్రమేంటో ప్రభాస్‌ ఆలోచించారు. ‘బాహుబలి’ తర్వాత ఈ సినిమా అయితే, నా ఫ్యాన్స్‌కు నచ్చుతుంది అని చెప్పి చేశాడు. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ చేస్తాడా? అని చాలా మందికి అనుమానం ఉంది. ఫస్ట్‌లుక్‌ చూసినప్పుడే సినిమా స్థాయి ఏంటో తెలిసింది. టీజర్‌తో అది నిజమని అనిపించింది. ట్రైలర్‌తో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. చాలా బాగా చేశాడు. ఇక సినిమాతో ఎంతో మరో మెట్టు ఎదుగుతాడు’’అని చెప్పుకొచ్చారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa