నేచురల్ స్టార్ నాని యొక్క ఇటీవలి చిత్రం 'హిట్ 3' నటుడి కెరీర్‌లో అత్యున్నత గ్రాస్ గా అవతరించింది. సైలేష్ కోలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 120 కోట్లు వాసులు చేసింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం మరియు కన్నడ ఆడియోలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ ఉపశీర్షికలతో పాటు ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో నానికి జోడిగా యువ కన్నడ నటి శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వైవల్ డ్రామాలో అడివి శేష్ మరియు కార్తీ అతిధి పాత్రలలో నటించారు. నాని మరియు ప్రశాంతి టిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మిక్కీ జె మేయర్ సంగీతం కలిగి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa