తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమాకు మూడు పురస్కారాలు వరించాయి. ఉత్తమ మూడో చిత్రంగా, బెస్ట్ ఎడిటర్ (నవీన్ నూలి), స్పెషల్ జ్యూరీ (దుల్కర్ సల్మాన్) అవార్డులను దక్కించుకుంది. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంలో దుల్కర్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు.కల్కి 2898AD సినిమా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు గెలుచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa