ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది రాజా సాబ్' టీజర్ విడుదల ఎప్పుడంటే...!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 02:49 PM

టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక ఉల్లాసమైన హర్రర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్‌' లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా టీజర్ జూన్ 16న ఉదయం 10:52 గంటలకి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ ట్యూన్ చేశారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. మాళవిక మోహానన్, నిధీ అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, సత్యరాజ్, జరీనా వహాబ్, వరలక్ష్మి శరత్‌కుమార్, యోగి బాబు, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa