కోలీవుడ్ ప్రముఖ నటుడు జయం రవి, నటి కెనీషా మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ఆలయంలో పూల దండలతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారికి వివాహం జరిగిందా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జయం రవి గురువారం తన సొంత నిర్మాణ సంస్థ ‘రవి మోహన్ స్టూడియోస్’ లోగోను సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముందు ఆయన, కెనీషాతో కలిసి చెన్నైలోని ప్రసిద్ధ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులతో కలిసి దిగిన ఫోటోల్లో ఇద్దరి మెడలోనూ పూల దండలు కనిపించాయి. ఈ ఫోటోలే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ, వారి పెళ్లి గురించి రకరకాల చర్చలకు దారితీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa