అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియోల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన ఫైర్ గ్లింప్స్, స్టైలిష్ విజువల్స్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా అడవి శేష్ డబ్బింగ్ టెస్ట్ పూర్తిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. కాగా, ఈనెల 8 నుంచి కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa