అప్సర్ దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన "శివం భజే" అనే యాక్షన్ డ్రామా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో జూన్ 1న వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఈ టెలికాస్ట్ 2.11 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. దిగంగన సూర్యవంశీ ఈ సినిమాలో అశ్విన్ కి జోడిగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళి శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ని మహేశ్వర రెడ్డి మూలి నిర్మించారు. వికాస్ బాడిసా ఈ చిత్రానికి సంగీతం అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో ఈ సినిమా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa