టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమాలో ధనుశ్‌తో పాటు రష్మిక మందన్నా, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa