ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరాకృతిపై కామెంట్లకు నటి సమంత ఘాటు స్పందన

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 08:22 PM

సోషల్ మీడియాలో తన శరీరాకృతిపై వస్తున్న కామెంట్లకు ప్రముఖ నటి సమంత తనదైన శైలిలో గట్టి సమాధానం ఇచ్చారు. తనను విమర్శించే వారికి ఆమె ఓ ఫిట్‌నెస్ సవాల్ విసిరారు. జిమ్‌లో తాను పుల్-అప్స్ చేస్తున్న వీడియోను పంచుకుంటూ, తనపై కామెంట్ చేసే ముందు కనీసం మూడు పుల్-అప్స్ తీసి చూపించాలని, అలా చేయలేని పక్షంలో తన గురించి మాట్లాడటం మానేయాలని ఘాటుగా స్పందించారు.ఇటీవల ఓ అవార్డుల కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. అక్కడ నటి శ్రీలీలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు, సమంత బాగా సన్నబడ్డారని, అనారోగ్యంగా కనిపిస్తున్నారంటూ కామెంట్లు చేశారు. కొంతకాలంగా తన లుక్స్‌పై వస్తున్న ఇలాంటి విమర్శలకు సమాధానంగా సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో సమంత జిమ్‌లో ఎంతో శ్రమిస్తూ పుల్-అప్స్ చేయడం కనిపిస్తుంది. దీనికి ఆమె ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. "ఒక డీల్ చేసుకుందాం. 'సన్నబడ్డావు', 'ఆరోగ్యం బాలేదా లాంటి చెత్త కామెంట్స్ నాపై చేసే ముందు, మీరు కనీసం మూడు పుల్-అప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే, దయచేసి నా గురించి అలా మాట్లాడకండి," అంటూ తన విమర్శకులకు సవాల్ విసిరారు.కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. 2022లో తాను ఈ వ్యాధి బారిన పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటూనే, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు, శరీర మార్పులపై వస్తున్న ట్రోలింగ్‌కు ఈ పోస్ట్‌తో సమంత గట్టిగా బదులిచ్చినట్లయింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa