ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'కూలీ'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 03:49 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో విడుదల కానున్న 'కూలీ' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 14, 2025న పెద్ద స్క్రీన్‌లను తాకనుంది. మేకర్స్ ఇటీవలే మొదటి సింగిల్ చికిటును ఆవిష్కరించారు. అనిరుద్ స్వరపరిచిన పెప్పీ డ్యాన్స్ నంబర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఇప్పుడు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని ప్రముఖ బ్యానర్ హంసిని రికార్డు ధరకి సొంతం చేసుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్‌ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హస్సన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa