ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కెడి-ది డెవిల్‌' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 06:33 PM

ధృవ సర్జా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం KD – ది డెవిల్‌లో ఒక అద్భుతమైన పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్‌పై సుప్రీత్ నిర్మించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని RK సినీప్లెస్ లో జులై 10న సాయంత్రం 5 గంటలకి నుండి నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో రమేష్ అరవింద్, వి. రవిచంద్రన్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, రీష్మా నానయ్య, జిషు సేన్‌గుప్తా మరియు నోరా ఫతేహి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa