స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠ పురములో'. ఈ చిత్రానికి నిర్మాతలుగా అల్లు అరవింద్, రాధకృష్ణ లు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సగం పైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ హైదరాబాద్‌లో వేసిన ఇంటి సెట్లో ఇంకొంచెం భాగం షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa