తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు సక్సెస్ గా కంప్లీట్ చేసుకొని చాలా రసవత్తరంగా నడుస్తోంది. హౌస్ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఆరో వారంలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళతారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లలో ఏకంగా ఐదారుగురు వరకు నామినేట్ అయ్యేవారు. అయితే ఈ వారం ముందుగా ఆరుగురు ఎలిమినేట్ అయినా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో సక్సెస్ అవ్వడంతో ముగ్గురు సేఫ్ అయ్యారు. ఇక త్యాగం చేసిన హిమజ, మహేష్ విట్టా, పునర్నవి లు మాత్రమే ఇప్పుడు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఇక నాగార్జున జన్మదిన వేడుకల కోసం స్పెయిన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండడంతో ఈ వారం హోస్ట్ గా శివగామి రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం శివగామి ఎవరిని హౌస్ నుంచి బయటకు పంపిస్తుందో ? చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఎవరైనా గెస్టులుగా హౌస్ కు హోస్ట్ గా వచ్చినప్పుడు ఎవ్వరిని ఎలిమినేట్ చేయరన్న సంప్రదాయం ఒకటి ఉంది. మరి శివగామి స్పెషల్ గెస్ట్ హోస్ట్ గా ఎవరిని ఎలిమినేట్ చేయకుండా ఉంటుందా ? లేదా ? ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా ఎలిమినేషన్ లో ఎవరో ఒకరిని ఇంటి నుంచి పంపించేస్తుందా ? అన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa