బాలకృష్ణ ప్రస్తుతం కె యస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనాల్ గతంలో 'లెజెండ్'.. 'డిక్టేటర్' చిత్రాల్లో బాలయ్యతో కలిసి నటించింది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటు బాలయ్య సోనాల్ పైన ఒక బ్యూటిఫుల్ సాంగ్ ను చిత్రీకరించారు. వినాయక చవితికి కానుక అన్నట్టుగా ఈ సినిమా నుండి ఒక స్టిల్ ను రిలీజ్ చేశారు. బాలయ్య ఈ స్టిల్ లో యమా స్టైలిష్ గా ఉన్నారు. ప్రింటెడ్ కలర్స్ ఉండే హాఫ్ షర్టు.. జీన్స్ ప్యాంట్.. కళ్ళకు గాగుల్స్.. వ్యాన్ డైక్ స్టైల్ గడ్డంతో ఓ సూపర్ డ్యాన్స్ పోజిచ్చారు. సోనాల్ కూడా బాలయ్య కు పోటీ అన్నట్టుగా బటన్లు వదిలేసిన షర్టు.. మైక్రో నిక్కర్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa