ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోను కలిసేందుకు 900 కిలోమీటర్లు నడిచిన యువకుడు

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 05:05 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేశాడు. 18 రోజులపాటు ఏకదాటిగా నడుస్తూ మొత్తానికి ఆదివారం తన అభిమాన నటుడిని కలుసుకున్నాడు. అతడి అభిమానానికి పొంగిపోయిన అక్షయ్ కుమార్.. మరోసారి ఇలాంటి సాహసాలు చేయవద్దంటూ సుతిమెత్తంగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని అక్షయ్ ట్వీట్ చేస్తూ.. ‘‘యువత ఇలాంటి దృఢ సంకల్పాన్ని లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగిస్తే.. అడ్డంకులే ఉండవు’’ అని పేర్కొన్నాడు. శక్తియుక్తులను జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించాలని, ఇలాంటి సాహసాలను ఎవరూ చేయవద్దని అక్షయ్ తన అభిమానులకు సూచించాడు.


అక్షయ్ కుమార్‌ను కలిసేందుకు వచ్చిన ఆ కుర్రాడి పేరు పర్‌బత్. గుజరాత్‌లోని ద్వారక నుంచి కాలినడకన బయలుదేరి 18 రోజులుపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎట్టకేలకు ముంబై చేరుకున్నాడు. పర్‌బత్ పట్టుదలకు కరిగిపోయిన అక్షయ్ అతడిని కలిసి ఫొటో దిగాడు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. అక్షయ్‌ను కలిసేందుకు తాను కాలినడకనే ఎందుకు ఎంచుకున్నదీ పరబత్ చెప్పిన వీడియోను, ఫొటోలను కూడా అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో పర్‌బత్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. నడక ప్రాముఖ్యాన్ని చెప్పేందుకే నేను అక్షయ్‌ను కలిసేందుకు నడకను ఎంచుకున్నా’’ అని పర్‌బత్ చెప్పుకొచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa