ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జరీన్‌ఖాన్ ఫోటో పై నెటిజన్స్ అసభ్య కామెంట్లు

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 12:23 PM

జరీన్‌ఖాన్ ఫోటో పై నెటిజన్స్ అసభ్య కామెంట్లు. బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లోనే నటించినా తన అందం, నటనతో గుర్తింపు పొందిన నటి  జరీన్‌ఖాన్. సోషల్ మీడియాలో తన ఫోటోలు పోస్టు చేయగా, ఈ ఫోటోలపై జరీన్‌ను నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలో ఆమె చొక్కా, లెహెంగా ధరించగా.. చొక్కాను కొంచెం పైకి కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె పొట్టపై ముడతలుగా ఉండడంతో నెటిజన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. సిగ్గుగా అనిపించడం లేదా అలా ఫోజులివ్వడానికనీ, పరమ దరిద్రంగా ఉన్నావంటూ కామెంట్స్ చేశారు.  ఈ కామెంట్స్‌పై ఆమె తీవ్రంగా స్పందించారు. నేను సహజంగా తీసుకున్న ఫోటోలనే పోస్టు చేశాననీ, ఫోటోషాప్‌లో మార్ఫింగ్ చేయడం, ఎలాంటి మరకలు కన్పించకుండా మేకప్ వేసుకోవడం తనకిష్టముండదని తెలిపింది. 50 కేజీల బరువు తగ్గినందుకు నేను గర్వపడుతున్నానని తెలిపింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa