చిత్ర పరిశ్రమలోకి 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వారికి చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కేందుకు తన వంతు కృషి చేస్తానని స్టార్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. చిత్రపురి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని ఆయన సృష్టం చేశారు. ఈ అంశంపై ఎన్.శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, తమ్మారెడ్డి భరద్వాజలతో చర్చిస్తానని తెలిపారు. హైదరాబాద్‌లోని చిత్రపురి సాధన సమితి సభ్యులు పవన్ కళ్యాణ్‌ని కలిశారు. 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న తమకు ఇళ్లు దక్కడం లేదనీ, చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వారికి ఫ్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందించి మాట్లాడుతూ హైదరాబాద్ చిత్రపురి కాలనీలో తెలుగు సినీ కార్మికుల సొంత ఇంటికల నెరవేర్చేందుకు కృషి చేస్తాను. దీనిపై చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో మాట్లాడతాను అని అన్నారు.
