ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్మీకిని హరీషే డైరెక్ట్ చేస్తే ఓకే !

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 07:42 PM

ఒకప్పుడు వీవీవినాయక్ మాదిరిగానే ఇప్పుడు హరీష్ మెగా కాంపౌండ్ డైరెక్టర్ ఐపోయాడు. గబ్బర్ సింగ్ హిట్ ఇచ్చిన దగ్గరనుంచి ఇటు బ్రదర్స్ వారసుల సినిమాల్ని అటు బావగారి వారసుల సినిమాల్ని తీస్తూ మెగా కాంపౌండ్ కి ఫామిలీ డైరెక్టర్ ఐపోయాడు. ఇప్పుడు వాల్మీకి సినిమా చుస్తే కొత్తగానే కనిపిస్తోంది. తమిళ్ సినిమా జిగర్ తండా ఆధారంగా వస్తున్నా ఈ వాల్మీకి వరుణ్ తేజ్ కి పేరు తెచ్చేలాగే ఉంది. ఏమైనా పెరటి చెట్టు వైద్యానికి పనికి రానట్టు, మరి తమనే  ఇష్టపడుతూ తమ దగ్గరే ఉండే డైరెక్టర్లతో హిట్ కొడుతుంటారు మెగా హీరోలు. అయితే మెగా కాంపౌండ్ ఉంటె ఆ హీరోల ఇమేజ్ కి తగ్గట్టు కథలు సీన్లు మార్చడం తప్పదని జనం అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని , డైరెక్టర్లని హీరోలు డైరెక్ట్ చేయకుండా ఉన్నప్పుడే మంచి సినిమాలు వస్తాయన్నది మరచిపోకూడని నిజం.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa