ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని అఖిల్ సరసన పూజాహెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 04:22 PM

రంగస్థలం సినిమాలో జిగేలురాణిగా కుర్రకారు హృదయాల్ని హుషారెత్తించిన పూజాహెగ్డే. తెలుగు చిత్రసీమలో కన్నడ కస్తూరి పూజాహెగ్డే హవా నడుస్తున్నది. పలు భారీ చిత్రాల్లో కథానాయికగా  ఈ సుందరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.  ఈ అమ్మడు అక్కడి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఇటీవలే మహర్షి సినిమాలో మహేష్‌బాబు సరసన తళుక్కున మెరిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ వయ్యారి అక్కినేని అఖిల్ సరసన నటించబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. బన్నివాసు నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే ఖరారైంది. ఒకలైలా కోసం చిత్రంలో నాగచైతన్యతో జత కట్టిన ఈ పొడుగుకాళ్ల సొగసరి తాజాగా ఆయన సోదరుడితో ఆడిపాడబోతుండటం విశేషం. ఇదిలావుండగా ఒంగోలు గిత్త తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తెలుగులో ఏ చిత్రానికి దర్శకత్వం వహించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నిర్ధేశకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఫీల్‌గుడ్‌రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో ఇల వైకుంఠపురములో వాల్మీకి చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa