అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో అల వైకుంఠపురంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా షూటింగ్ కు కాస్త రెస్ట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో బన్నీ తన కుటుంబంతో కలిసి వినాయక చవితి వేడుకలు జరుపుకున్నారు.
ఇదిలా ఉంటె, గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు గణేష్ నిమర్జనం జరుగుతున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో బన్నీ సందడి చేశారు. తన కుటుంబంతో కలిసి గణేష్ నిమర్జన వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ఆఫీస్ లో పూజలు చేశారు. అనంతరం విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించే ముందు అందరితో కలిసి గణపతి బప్పా బొరియా అంటూ డ్యాన్స్ చేశారు.