సెప్టెంబర్ 15 న జరిగే సైరా నరసింహరెడ్డి ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారని సమాచారం. చలన చిత్ర చరిత్రలో కానీ వినీ ఎరుగని తీరుగా ఈ చిత్ర విడుదలకు ముందు పలు కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర నిర్మాత, హీరో రాంచరణ్ యోచిస్తున్నారు. అలాగే ఈ చిత్రం విడుదలకు ఒక రోజు ముందు ప్రభాస్ కూడా స్పెషల్ గా ఈ సినిమా గురించి మీడియాలో లవ్ ప్రోగ్రాములో పాల్గొంటారని భావిస్తున్నారు. ఐతే దీనిని నిర్మాతలు ధృవీకరించలేదు.