బాహుబలి రెండు పార్టులను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే భాగంగా ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ విడుదలైంది. ఈ మూవీ విడుదల నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభాస్, అనుష్క, రానా సహా నటీనటులు, దర్శకుడు రాజమౌళి కూడా ఇందులో భాగం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa