ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో చిత్రం కోసం జతకడుతున్న 'సైయారా' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:22 AM

బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'సైయారా' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రయాణంలో భారీ ఘనతను సాధించింది. అహాన్ పాండే మరియు అనీత్ పాడా దేశంలో సెన్సేషన్ గా మారారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ జంట మరోసారి జట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  వారు ఇటీవల దర్శకుడు మోహిత్ సూరి నివాసంలో కనిపించరు. సైయారాతో హిట్ అందుకున్న ఈ ముగ్గురూ, గాసిప్ ప్రకారం, కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు లేటెస్ట్ టాక్. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజులలో ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa