ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసింది . బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ టాస్క్‌లోని నియమాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటి సభ్యులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇదీ ఓ టాస్కా? చెత్త టాస్క్ మీరే ఆడుకోండని బిగ్‌బాస్‌ను పునర్నవి హెచ్చరించడం టాస్క్‌లో సరిగా ఆడలేదని శ్రీముఖి, మహేష్, పునర్నవిలకు మరో పనిష్మెంట్ టాస్క్‌ను ఇవ్వడం దానినిసైతం పునర్నవి ధిక్కరించడం చివరకు వరుణ్ బుజ్జగింపులతో దిగిరావడం ఈ వారంలో హైలెట్‌గా నిలిచాయి. అయితే మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే వీరిద్దరు బిగ్‌బాస్ హౌస్‌లో ఇంతవరకు గొడవపడిన సందర్భాలు లేవు. నేటి ఎపిసోడ్‌లో అది కూడా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది నీ ఒక్కదాని ఒపీనియన్ కాదు. గ్రూప్ అంతటిది అంటూ వరుణ్‌చెప్పగా నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది. నా అభిప్రాయం నేను చెప్పాను అంటూ శ్రీముఖి బదులిచ్చింది. అయితే ఇది నా అభిప్రాయం అంటూ వరుణ్ చెప్పగా అయితే చెప్పు అని కోపంగా శ్రీముఖి అనడం కనిపిస్తోంది. మరి ఆ అభిప్రాయం ఏంటి? వారిద్దరి మధ్య ఆ గొడవెందుకు మొదలైందన్నది తెలియాలంటే ఏ రోజు ఎపిసోడ్ వరకు ఆగాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa