మహేష్ బాబు తో భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌లో మంచి నటించిన కియారా అద్వానీ .ఆ తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆమెకి భారీ ఫ్లాప్‌ని మూటగట్టుకుంది. దీంతో అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్సే కరువయ్యాయి. ఇక బాలీవుడ్‌లో రీసెంట్‌గా విడుదలైన కబీర్ సింగ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కాంచన రీమేక్‌లో నటిస్తుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లారెన్స్ తెరకెక్కిస్తున్నారు. కట్ చేస్తే కియారా బాలీవుడ్‌లో మరో హారర్ కామెడీకి పచ్చ జెండా ఊపిందని సమాచారం. బూల్ బులైయా( తెలుగులో చంద్రముఖి ) కి సీక్వెల్‌గా బూల్ బులైయా 2 అనే చిత్రం అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా,ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ మేకర్స్ భూషణ్ కుమార్, మూరద్ కేతని, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.జూలై 31, 2020న విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa