15 ఇయర్స్ ఇండస్ట్రీ. అయినా ఆమె జోరు తగ్గడం లేదు. క్రేజు కూడా తగ్గడం లేదు. గ్లామర్ అయితే ఇంకా పెరిగింది.. ఆమె ఎవరనుకుంటున్నారా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలకు “IIFA” అని క్యాప్షన్ ఇచ్చింది. ముంబైలో ఐఫా కు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలు.. స్టార్ హీరోయిన్లు చాలామంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కత్రినా కూడా హాజరయింది. లాంగ్ కోటు లాంటి రెడ్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి హొయలు పోతూ కార్పెట్ పై నడిచింది. ఇక డ్రెస్ ఎలా ఉందంటే విండోస్ 2019 వెర్షన్ లాగా ఉంది. సైడ్ నుంచి వెనక వరకూ ఓ పెద్ద విండో ఉంది. ఈ ఫోటోలు చూస్తుంటే గ్రీకు దేవత కత్రినా రూపంలో బాలీవుడ్ లో ఉందేమో అనిపిస్తోంది. ఆ ఒంపుసొంపులు.. ఆ హెయిర్ స్టైల్.. ఆ మేకప్.. ఆ సెక్సినెస్.. కత్రినాకు సాటి లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa