by Suryaa Desk | Tue, Oct 15, 2024, 01:42 PM
సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెలుగు నటుడు సుహాస్ నటించిన జనక అయితే గనక చిత్రం అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యొక్క పెయిడ్ ప్రీమియర్ షోస్ నుండి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ టూర్ డీటెయిల్స్ ని ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి వైజాగ్ లో ప్రెస్ మీట్ ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకి శారదా థియేటర్ ని చిత్ర బృందం విసిట్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సంగీత విపిన్ కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News