by Suryaa Desk | Sat, Dec 21, 2024, 11:39 AM
అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.అనంతరం తెలంగాణ భవన్లో యుగంధర్ గౌడ్ మాట్లాడారు. ‘‘అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అభిమానులను కంట్రోల్ చేయలేమని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ నిర్లక్ష్యంగానే ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడు’’అని తెలిపారు.
Latest News