by Suryaa Desk | Fri, Jan 10, 2025, 04:11 PM
'యానిమల్' షూట్ రోజులు గుర్తు చేసుకున్నారు నటి త్రిప్తి డిమ్రి . సినిమాలో కీలకంగా ఉండే ఓ సన్నివేశంలో యాక్ట్ చేయడానికి తాను ఎంతో ఇబ్బందిపడ్డానని అన్నారు.ఆ సమయంలో రణ్‌బీర్‌కపూర్ తనకెంతో సపోర్ట్ చేశారని చెప్పారు.''యానిమల్'తోపాటు మరో సినిమా కోసం కూడా ఆ సమయంలోనే వర్క్ చేశా. డైలీ రెండు షిఫ్ట్స్ ఉండటం వల్ల బాగా అలసిపోయేదాన్ని. సరిగ్గా నిద్ర ఉండేది కాదు. 'యానిమల్'లో రణ్‌బీర్‌తో మాట్లాడే ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నేను ఎంతో ఇబ్బందిపడ్డాను. అది చాలా పెద్ద డైలాగ్ కావడంతో పూర్తిగా మర్చిపోయా. సీన్‌లో భాగంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సిఉండగా.. నాకు ఏమాత్రం ఏడుపు రాలేదు. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యా. నా పరిస్థితి అర్థం చేసుకున్న రణ్‌బీర్ ఎంతగానో సపోర్ట్ చేశాడు. వాళ్ల సమయాన్ని నేను వృథా చేస్తున్నాననే భావన నాకు కలిగించకుండా ఉండేందుకు తోడ్పడ్డాడు. కంగారు పడవద్దని.. రిలాక్స్‌గా ఉండమని తెలిపాడు'' అని త్రిప్తి డిమ్రి తెలిపారు.ఇందులో జోయా పాత్ర అంగీకరించడంపై ఇటీవల త్రిప్తి డిమ్రి స్పందించారు. ''అప్పటివరకూ కేవలం సున్నితమైన, పాజిటివ్ రోల్స్ మాత్రమే పోషించా. 'యానిమల్'లో నా పాత్ర ఇందుకు భిన్నమైంది. మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. పైకి మాత్రం దయ, సానుభూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు. అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పాను'' అని అన్నారు.'యానిమల్' తర్వాత త్రిప్తికి యూత్‌లో క్రేజ్ పెరిగిన మాట వాస్తవమే. దీనితర్వాత ఆమె వరుస చిత్రాలు ఓకే చేశారు. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆషికీ 3'లో కథానాయికగా ఆమెను ఎంచుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్‌లో త్రిప్తి వర్క్ చేయడం లేదని బీటౌన్‌లో టాక్. 'యానిమల్' కారణంగా ఆమెకు బోల్డ్ ఇమేజ్ వచ్చిందని.. అందుకే త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రానికి ఆమెను ఎంపిక చేసుకోవడంపై మేకర్స్ ఆలోచనలో పడ్డారని సమాచారం. త్రిప్తి స్థానంలో మరో నూతన కథానాయికను ఎంచుకోవాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కార్తిక్ ఆర్యన్ ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నారు.
Latest News