by Suryaa Desk | Tue, Jan 07, 2025, 10:40 AM
బిగ్ బాస్ ఫ్రేమ్, నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టీవీ సీరియల్స్ లలో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ ఫేమ్ తో బుల్లితెరపై అడుగు పెట్టింది.అలా చిత్రలహరి, వినయ విధేయ రామా, జంబలకడిపంబ, ఉన్నదే ఒకటే, జిందగీ, స్పైడర్ వంటి తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమజ. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 అడుగుపెట్టి తన డేరింగ్ అండ్ డాషింగ్ ఆటతీరుతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..హిమజ తన బ్రేకప్ లవ్ స్టోరీ పై గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.నటి హిమజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమ, పెళ్లిపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమ, పెళ్లి గురించి.. ప్రస్తుతం పట్టించుకోవడం లేదని, కెరీర్ గురించి ఆలోచిస్తున్నారని పేర్కొంది. అలాగే, తన జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్ ప్రపోజల్స్ తనకు రాలేదని, కాంప్లిమెంట్ గా ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయని చెప్పింది. దీంతో మిమ్మల్ని ఎవరైనా లవ్ చేయరా? అని యాంకర్ ప్రశ్నించగా.. 'ఎందుకు చెయ్యరు. నా లైఫ్ లోను లవ్ స్టోరీ ఉన్నాయి. నన్ను చాలామంది లవ్ చేశారు. నేను వారిని లవ్ చేశాను. కానీ, ఇప్పుడు ఎవరి లైఫ్ వారిది. దాన్ని బ్రేకప్ అని చెప్పి లవ్ వ్యాల్యూ ను తీయలేను. కానీ, ఒకసారి లవ్ చేస్తే.. అది లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. అది సినిమాలలో నటించే క్యారెక్టర్ లాంటిది కాదు కదా..' అంటూ సమాధానం ఇచ్చింది నటి హిమజ.
మీ లైఫ్ లో.. మీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. 'నా హార్ట్ లో చాలామంది ఉన్నారు. కొంతమంది మనసులో అలా ఉండిపోతారు అంతే.. నేను 8వ తరగతి లోనే ఒకరి లవ్ చేశా.. అతడు ఇప్పటికీ నా మనసులో అలానే ఉండిపోయాడు' అంటూ నటి హిమజ ఎమోషనల్ అయ్యారు. అయితే.. తన లవ్ స్టోరీ గురించి చెబుతూ కొంతమంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారని నిజానికి ఆ టైటిల్ లోని మ్యాటర్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా తన ఫ్రెండేనని, వ్యూస్ కోసం అలా థంబ్ నెల్ పెట్టింది' అని హిమజ పేర్కొంది.వాస్తవానికి ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే.. చిన్నప్పుడు ఎవరినైనా లవ్ చేసావా అని ప్రశ్నించగా.. వాళ్లు ఎక్కడో పెళ్లి చేసుకొని ఉంటారు. నేను వాళ్ల పేరు చెప్పి.. అందులో తాను నోరు విప్పితే.. వాళ్లు ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండి ఉంటారు కదా.. ఇప్పుడు వాళ్ల పేరు చెప్పి.. వాళ్ల కాపురాలను డిస్ట్రబ్ చేయడం ఎందుకనే మినింగ్ లో మాట్లాడినా.. కానీ, నేను నోరు విప్పితే వాళ్ల కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి వ్యూస్ సంపాదించుకున్నారు. ఎవరి స్వార్థం వారిది.' అని బిగ్ బాస్ ఫేమ్ హిమజ కామెంట్స్ చేసింది.
Latest News